Monday, December 23, 2024

ప్రారంభమైన గద్దర్ అంతిమయాత్ర.. భారీగా తరలివచ్చిన అభిమానులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజా గొంతుక, యుద్దనౌక గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన గద్దర్ అంతిమయాత్ర.. గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్‌బండ్ మీదుగా అల్వాల్ భూదేవినగర్‌లోని ఆయన నివాసం వరకు కొనసాగనుంది. తర్వాత ఆయన నివాసం వద్ద కొద్దిసేపు పార్థివదేహం ఉంచనున్నారు. అనంతరం 2 గంటలకు గద్దర్ స్థాపించిన మహాబోధి విద్యాలయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కాగా, అపోలో స్పెక్ట్రా అమీర్‌పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ కన్నుమూశారు. అభిమానులు, ప్రజల సందర్శనార్ధం ఆయన భౌతిక కాయం ఎల్బీస్టేడియానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News