Monday, December 23, 2024

నెల రోజుల్లో పార్టీని ప్రకటిస్తా : గద్దర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కళాకారులు, జర్నలిస్టులు సమక్షంలో నెలరోజుల్లో పార్టీని ప్రకటిస్తానని ప్రజా యుద్ధనౌక గద్దర్ ప్రకటించారు. . సోమవారం సరూర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభలో పాల్గొన్నారు. ఈ సభలో గద్దర్ ఆడి పాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీగా ఆయన పేర్కొన్నారు. 2018 లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో గద్దర్ తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గద్దర్ ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల సమయంలో గద్దర్ తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించారు. తనకు భద్రతను పెంచాలని పోలీసులను కోరారు. ఈ మేరకు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. మావోయిస్టు పార్టీతో సుధీర్ఘకాలం పాటు పనిచేసిన గద్దర్ జనజీవన స్రవంతిలో కలిశారు. 2018 ఎన్నికల సమయంలోనే గద్దర్ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. అదే సమయంలో తొలిసారిగా ఆయన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News