Sunday, January 19, 2025

షాకింగ్… యుద్ధనౌక గద్దర్ ఇకలేరు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాగాయకుడు, యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజుల నుంచి గుండె జబ్బుతో బాధపడుతున్నారు. 1949లో మెదక్ జిల్లా తుప్రాన్ గ్రామంలో దళిత కుటుంబం లచ్చమ-శేషమ్మ అనే పుణ్యదంపతులకు గద్దర్ జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన రాసిన పాటల్లో అమ్మా తెలంగాణమా అనే పాట సూపర్ హిట్ కావడంతో ఉద్యమానికి ఊపిరి పోసింది. నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ అనే పాటకు గద్దర్‌కు నంది అవార్డు వరించింది. ఆయన మాత్రం స్వీకరించలేదు.

Also Read: జయశంకర్ సర్ ఉద్యమ స్ఫూర్తి నింపారు: కవిత

గద్దర్ కు భార్య విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2003లో ఒక కుమారుడు మరణించాడు. 1975లో బ్యాంకింగ్ సెక్టార్ లో ఎగ్జామ్ రాయడంతో క్లర్క్ జాబ్ వచ్చింది. 1984 బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి బడుగు బలహీన వర్గాలు, దళితులను తన ఆట పాటలతో చైతన్య పరిచారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్ కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. 1997 ఏప్రిల్ 6న ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తన ఛాతీలో బుల్లెట్ ఉందని పలుమార్లు చెప్పారు. జన నాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి గద్దర్ దూసుకెళ్లారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీల మీటింగ్ లో పాల్గొన్ని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒరేయ్ రిక్షా, జై బోలో తెలంగాణ సినిమాలో నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News