Monday, January 27, 2025

సాగరతీరాన ‘గద్దర్’ విగ్రహం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కళాకారుడు, కవి, రచయిత, ప్రజాయుద్ద నౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన కళాకారుల్లో గద్దర్ అగ్రభాగాన ఉన్న విషయం తెలిసిందే. విప్లవోద్యమం నుంచి ప్రజాఉద్యమంలోకి వచ్చిన గద్దర్ గురించి తెలియనివారు ఉండరు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గద్దర్ పేరిటీ సినీ అవార్డులను ఏర్పాటుచేసి గౌరవించింది. అంతే కాకుండా ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి గౌరవించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు మౌఖిక అదేశాలు జారీచేశారు. ప్రజాయుద్దనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలాల ఎంపికపై జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమికంగా రెండు మూడు స్థలాలను ఎంపికచేయనున్నారు. వాటిలో ఒకదానిని ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News