Friday, March 14, 2025

ఉర్దూ సినిమాలకూ అవార్డులు

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్‌లో గద్దర్ అవార్డుల ప్రదానం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
సినిమా అవార్డులను వివాదం చేయవద్దు ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు

మన తెలంగాణ/హైదరాబాద్: గద్దర్ సినీ అవార్డుల కార్యక్రమం వచ్చేనెలలో వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఎఫ్‌డిసి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీ డియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ గద్దర్ అవార్డులకు సంబంధించిన విధివిధానాలు ఖరారు అయ్యాయని చెప్పారు. తెలుగుతో పాటు ఉర్దూ సినిమాలకు అవార్డుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నామని, గతంలో సింహా అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. 2014 నుంచి 2023 వ రకు ఒక్కో ఏడాదికి ఒక్కో సినిమాకు గద్దర్ అ వార్డు ఇవ్వనున్నట్లు దిల్ రాజు స్పష్టం చేశారు.

సినీ ప్రముఖులు పైడి జయరాజ్, కాంతారావు పే రుతో గౌరవ అవార్డులు ఇస్తున్నామని, సినిమా అవార్డుల విషయాలను వివాదాస్పదం చేయరాదని ఆయన సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అ వార్డులు ఉన్నాయో వాటన్నింటిని ఉం చుతూ ఒకటి రెండు మార్పులు చేశామన్నారు. తెలంగాణలో రెండో అధికార భాషగా ఉన్న ఉర్దూ సినిమాలను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బెస్ట్ ఫిల్మ్ అవార్డును పెట్టడం జరిగింది, ప్రతి ఏటా ఒక బెస్ట్ ఫిల్మ్ అవార్డును ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అని ఆయన వివరించారు. మార్చి 13 నుంచి గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. నటీనటులతో పా టు సినిమా సాంకేతిక నిపుణులు, జాతీయ సమైక్యత చిత్రం, బాలల చలన చిత్రం, ఫీచర్ ఫిల్మ్, హెరిటేజ్, పర్యావరణం, చరిత్రపై తీసే చలన చిత్రాలకు పురస్కారాలను అందజేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News