Monday, December 23, 2024

ప్రజాస్వామిక ఉద్యమాలకు గద్దర్ జీవితం స్ఫూర్తి : కాసాని సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సంతాపం తెలిపారు. తెలంగాణ ప్రజల గోస, యాస, ధిక్కార అస్తిత్వాన్ని తన వాణితో ప్రస్ఫుటంగా ప్రపంచానికి వినిపించిన విప్లవకారుడు గద్దర్ అని కొనియాడారు. సమ సమాజం కోసం తపిస్తూ ప్రజా యుధ్దనౌకగా చివరి శ్వాస వరకు పోరాడిన ఆయన మరణం విచారకరమన్నారు. పీడిత, తాడిత వర్గాలకు, పేద ప్రజల హక్కుల సాధనకు చివరి శ్వాస వరకు పోరాడిన గద్దరన్న మృతి ఆ వర్గాలకు తీరని లోటు అన్నారు.

గద్దర్ ను కోల్పోవడం ఆయన ఒక్క కుటుంబానికే కాదు సమస్త తెలంగాణ సమాజం ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టుగా దుంఖంతో ఉందన్నారు. గద్దరన్న జీవితం ప్రజాస్వామిక వాదులకు, అట్టడుగు వర్గాల ఆకాంక్షల సాధన కోసం జరుగుతున్న ఉద్యమాలకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. గద్దరన్న కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News