Tuesday, November 5, 2024

ఈనెల 25 నుంచి గడ్డాన్నారం మార్కెట్ బంద్

- Advertisement -
- Advertisement -

Gaddiannaram market will be closed from 25th

బాటసింగారంలో మార్కెట్ ఏర్పాటుకు చర్యలు
అన్ని ఏర్పాట్లు చేశామంటున్న అధికారులు
రైతులు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు
మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముత్యం రెడ్డి

హైదరాబాద్: గడ్డిన్నారం మార్కెట్‌ను బాటసింగారం తరలించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులకే కలిగే ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. మార్కెట్‌ను ఈ వారం రోజుల పాటు మూసివేయడం ద్వారా అక్కడ ఉన్న వ్యాపారులు, ఏజెంట్లు బాటసింగారంలో తమ షాపులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు. మార్కెట్ తరలిపుం ప్తూయిన తర్వాత బాటసింగారంలో వచ్చేనెల 1న తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో గడ్డిన్నారం నుంచి కోహెడ్ మార్కెట్‌కు తరలించే కార్యక్రమంలో భాగంగా జరిగిన సమస్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. విజయవాడ జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ మార్కెట్‌లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.44 ఎకరాల విస్తీర్ణంలో లాజిస్టిక్ పార్క్‌లో ఈ నూతనన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

సుమారు రూ ః 90 లక్షలతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.క్రయ విక్రయాల కోసం లక్ష ఎస్‌ఎఫ్‌టిల సామర్థం కలిగిన గోదాములను వినియోగించున్నారు. మామిడి సీజన్‌లో మరో నాలుగు ఎకరాల్లో తాత్కాలికంగా గోదాములు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు చెబుతున్నారు. వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ మార్కెట్‌కుఏ మామిడి పండ్లు తిగుమతి అవుతుండంలో వీటికోసం ప్రత్యేకంగా మరో 8 ఎకరాల స్థలం లీజుకు తీసుకుని గోదాములు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అంతే కాకుండా మార్కెట్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పిండమే కాకుండా వాహనాల రాకపోకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మౌలిక వసుతులకు ప్రాధాన్యత: నూతనంగా ఏర్పాటు కానున్న బాటసింగారం మార్కెట్‌లో అధికారులు మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇస్తున్నారు. కమీషన్ ఏజెంట్లు, హమాలీలలకు ఎటువంటి ఇబ్బందులు కలగకండా గోదాములు కేటాయిస్తున్నారు. వ్యాపారులు, రైతులు ,వాహనదారుల కోసం బ్యాంక్‌నును సైతం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ధర్మకాంటను ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్‌తో పాటు క్యాంటిన్‌ను ఏర్పాటు చేశారు. సమీపంలో పోలీస్ ఔట్‌పోస్టును ఏర్పాటు చేసిన రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వైద్యం అందించేందుకు ఆసుపత్రితో పాటు ఉచితంగా మందులు అందచేయనున్నారు. తాగు నీరు, మూత్రళాలల ఏర్పాటు చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లలో భాగంగా అక్కడ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు.

స్వచ్చందంగా ముందుకు వస్తున్న వ్యాపారులు:  మార్కెట్ కమిటీ ఛైర్మన్

ఇప్పటికే అనేక మంది వ్యాపారులు తమ కార్యకలాపాలను అక్కడ కొనసాగించేందుకు ముందుకు వస్తుంటే మరి కొంత మంది అధికారుల కల్పించిన అత్యాధునిక సౌకర్యలను చూసి స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కందాడి ముత్యం రెడ్డి చెబుతున్నారు. రైతులకు, హమాలీలకు, కమిషన్ ఏజేంట్లకు ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News