Wednesday, January 22, 2025

బిజెపి కీలక కమిటీ నుంచి గడ్కరీ, చౌహాన్ ఔట్

- Advertisement -
- Advertisement -

Gadkari and Chauhan out of BJP's key committee

రెండు కమిటీల్లో 77 ఏళ్ల యడియూరప్పకు చోటు

న్యూఢిల్లీ : బీజేపీలో వ్యవస్థీకృత మార్పులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ పార్లమెంటరీ బోర్డును పునర్ వ్యవస్థీకరించారు. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బోర్డు నుంచి తొలగించారు. కొత్తగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప , సర్బానంద సోనోవాల్, కె. లక్ష్మణ్ లను తీసుకున్నారు. ఈ బోర్డులో జేపీ నడ్డా (అధ్యక్షుడు) , నరేంద్రమోడీ, రాజ్‌నాధ్‌సింగ్, అమిత్‌షా, బీఎస్ యడియూరప్ప, సర్బానంద సోనోవాల్, కె లక్ష్మన్, ఇక్బాల్ సింగ్ లాల్ పురా, సుధా యాదవ్ , సత్యనారాయణ జటియా, బిఎల్ సంతోష్ ఉన్నారు. ఇక బిజెపి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కూడా మార్పులు చేశారు. దీంతో కొత్తగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు స్థానం కల్పించారు.

బీజేపీ కొత్త సీఈసీలో జేపీ నడ్డా (అధ్యక్షుడు), నరేంద్రమోడీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, బీఎస్ యడియూరప్ప, సర్బానంద్ సోనోవాల్, కె. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మాథూర్, బీఎస్ సంతోష్, పసతి శ్రీనివాస్ ఉన్నారు. ఈ రెండు కమిటీల్లో మోడీ సర్కారులో అత్యంత సీనియర్ మంత్రి గడ్కరీకి స్థానం దక్కక పోవడం గమనార్హం. మరోపక్క పార్టీ పెట్టుకొన్న 75 ఏళ్ల వయోపరిమితికి భిన్నంగా 77 ఏళ్ల యడియూరప్ప ఈ రెండు కమిటీల్లో స్థానం దక్కించుకోవడం విశేషం.. కర్ణాటకలో ఆయనకు ఉన్న పట్టు కారణంగా పార్టీలో కేంద్ర కమిటీల్లో స్థానం దక్కించుకొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News