Friday, January 10, 2025

డీజిల్ వాహనాలపై 10 శాతం అదనపు జిఎస్‌టి: గడ్కరీ వివరణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డీజిల్‌తో నడిచే వాహనాలపై 10 శాతం అదనపు జిఎస్‌టిని విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఖండించారు. అటువంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని ఆయన వివరించారు.

అంతకుముందు ఎస్‌ఐఎఎం సదస్సులో గడ్కరీ ప్రసంగిస్తూ వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు డీజిల్ వాహనాలపై 10 శాతం అదనపు జిఎస్‌టి రూపంలో కాలుష్య పన్నును విధించాలని తాను ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. డీజిల్‌తో నడిచే వాహనాలపై 10 శాతం అదనపు జిఎస్‌టి విధించాలని కోరుతూ నేటి సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రికి తాను ఒక లేఖ ఇవ్వనున్నట్లు గడ్కరీ వెల్లడించారు.

డీజిల్‌కు గుడ్‌బై చెప్పండి..డీజిల్ వాహనాల తయారీని ఆపండి. లేని పక్షంలో డీజిల్ వాహనాలపై పన్నులను పెంవలసి స్తుంది. దీనివల్ల ఆ వాహనాలను రానున్న రోజుల్లో విక్రయించడం కష్టమవుతుంది అంటూ గడ్కరీ వాహన తయారీ కంపెనీలను హెచ్చరించారు.

డీజిల్‌తో నడిచే జనరేటర్లపై కూడా అదనపు జిఎస్‌టి విధించాలని తాను ప్రతిపాదించనున్నట్లు ఆయన తెలిపారు. లెథనాల్ వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టాలని ఆయన పరిశ్రమలను కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News