న్యూఢిల్లీ : దేశం లోనే తొలిసారి ఢిల్లీ నుంచి జైపూర్‌కు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది తన కల అని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీ లోని ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మణిపూర్, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్‌లలో రోప్‌వే కేబుల్స్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు 47 ప్రతిపాదనలు వచ్చాయన్నారు. తమ మంత్రిత్వశాఖ వద్ద బడ్జెట్‌కు కొదవలేదనీ, మార్కెట్ కూడా అందుకు అనుగుణంగానే ఉన్నట్టు తెలిపారు. మరోవైపు 202223 కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఉపరితల రవాణా ,హైవేల మంత్రిత్వశాఖకు రూ.1.99 లక్షల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీంట్లో దేశం లోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ది కోసం జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) కే 1.34 లక్షల కోట్లు కేటాయించనున్నారు.
దేశంలో ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలనేది నా కల : కేంద్ర మంత్రి గడ్కరీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -