Sunday, January 19, 2025

అభివృద్ధి అడ్డా

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాష్ట్రం

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు
కనిపిస్తున్నాయి భారతదేశ
అభివృద్ధిలో హైదరాబాద్
కీలకంగా మారింది
33జిల్లాల్లో 32
జాతీయ రహదారులతో
అనుసంధానం జరిగింది
రీజనల్ రింగ్‌రోడ్డు డిపిఆర్
పూర్తయింది ఇది ట్రైలర్
మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే
ఉంది ఆర్‌ఆర్‌ఆర్
శంకుస్థాపనకు వస్తా
శంషాబాద్‌లో విస్తరణ
పనుల శంకుస్థాపన
కేంద్ర నితిన్ గడ్కరీ

మన తెలంగాణ: ప్రగతిశీల సంపన్న రాష్ట్రమని ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్స్ ప్రధానమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. శంషాబాద్‌లో హైవేల విస్తరణ పనులకు శుక్రవారం గడ్కరీ శంకుస్థాపన చేశారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపం లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు జాతీయ ర హదారుల అనుసంధానం జరిగిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ రీజనల్ రింగ్‌రోడ్డు డిపిఆర్ పూర్తయ్యిందని, ఇది ట్రైలర్ మాత్రమేనని, సినిమా ఇంకా మిగిలే ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేయడానికి మూడునెలల్లో వస్తానని, తెలంగాణ అభివృద్ధి చెందితే భారతదే శం అభివృద్ధి సాధించినట్లేనన్నారు. రింగ్‌రోడ్డు కోసం భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నానని, నేషనల్ హైవేల వెంట లాజిస్టిక్స్ పార్కులు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణలో కా ళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కనిపిస్తున్నాయని నితిన్‌గడ్కరీ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోరిన వెంటనే కేంద్రం
ఇచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య తీరిందన్నారు. భారతదేశ అభివృద్ధిలో హైద రాబాద్ కీలకంగా మారిందని, అమెరికా రోడ్లతో సమానంగా తెలంగాణ హైవేలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితోనే పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయని నితిన్‌గడ్కరీ పేర్కొన్నారు.

తెలంగాణలో ఐదు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు..

2014 నుంచి తెలంగాణలో 4,996 కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించామని, తెలంగాణలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో లింక్ చేయడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. దేశవ్యాప్తంగా 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌లకు గాను తెలంగాణలో ఐదు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఐదు వేల కోట్లతో హైదరాబాద్ టు విశాఖపట్నం హైవే నాగపూర్ విజయవాడ హైవే కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గడ్కరీ వివరించారు.

రాష్ట్రంలో 4,996కి.మీల జాతీయ రహదారుల నిర్మాణం: కిషన్‌రెడ్డి

జాతీయ రహదారుల ముఖచిత్రం మార్చేసిన ఘనత డైనమిక్ మినిస్టర్ నితిన్ గడ్కరీదేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గేమ్ ఛేంజర్‌గా రీజనల్ రింగ్ రోడ్డు ఉండబోతోందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే అభివృద్ధిలో తెలంగాణ ముందుంటుందన్నారు. మోడీ హాయాంలో తెలంగాణలో 4,996కి.మీల జాతీయ రహదారులు నిర్మించామని కిషన్ రెడ్డి తెలిపారు.

నితిన్ గడ్కరీకి చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి వినతిపత్రం

శ్రీశైలం హైవేను 4లేన్ల రహదారిగా విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి చేవెళ్ల ఎంపి డాక్టర్ జి.రంజిత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని జల్ పల్లి మునిసిపాలిటీ, పహాడీ షరీఫ్ ప్రాంతాలు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే మార్గ మధ్యలోకి వస్తాయని, ఈ రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రితో ఎంపి తెలిపారు. దీంతోపాటు అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో ఈ రోడ్డును నాలుగు వరుసల జాతీయ రహదారి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపి రంజిత్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు.

కేంద్రమంత్రికి స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రివేముల

కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి సిఎం కెసిఆర్ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం తెలిపారు. 2014 నుంచి 2525 కిలోమీటర్ల పొడవును పొడిగించడం ద్వారా రాష్ట్రంలో ఎన్‌హెచ్ నెట్‌వర్క్‌ను మెరుగుపడిందన్నారు. వార్షిక ప్రణాళిక 2021-,22లో 613 కి.మీల పొడవుతో రూ.6211 కోట్ల విలువైన 15 ఎన్‌హెచ్ ప్రాజెక్ట్‌లను మంజూరు చేసినందుకు వేముల కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మంచి రహదారి మౌలిక సదుపాయాలను రూపొందించడంలో రాష్ట్రానికి భారత ప్రభుత్వ మద్ధతు, ఆశీర్వాదాలు అవసరమని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత, 3663 కి.మీల పొడవునా 29 రాష్ట్ర రహదారులను కొత్త ఎన్‌హెచ్‌లుగా అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని మంత్రి వేముల పేర్కొన్నారు.

541 కి.మీల రోడ్లను నేషనల్ హైవేలుగా నోటిఫై చేయాలి

ఇందులో ఇప్పటివరకు 2525 కి.మీ పొడవు మాత్రమే కొత్త ఎన్‌హెచ్‌లుగా నోటిఫై చేయబడ్డాయని ఇందులో బ్యాలెన్స్ పొడవు 1138 కి.మీలు ఇంకా తెలియజేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. చౌటుప్పల్ (ఎన్‌హెచ్ -65) -షాద్‌నగర్ (ఎన్‌హెచ్ -44)-సంగారెడ్డి (ఎన్‌హెచ్ 65) (ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం) 182 కి.మీ, కరీంనగర్-, కామారెడ్డి-, ఎల్లారెడ్డి-పిట్లం 165 కి.మీ, కొత్తకోట, -గద్వాల్-, మంత్రాలయం 70 కి.మీ, జహీరాబాద్-, బీదర్-, డెగ్లూర్ 25 కి.మీ, సారపాక-, ఏటూరునాగారం 99కి.మీ, మొత్తం 541 కి.మీల రోడ్లను నేషనల్ హైవేలుగా నోటిఫై చేయాలని కేంద్రమంత్రికి వేముల ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంపిలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాసరెడ్డి తదితరులతో పాటు కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రూ.7,853కోట్ల జాతీయ రహదారులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయగా, 2 జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. దాదాపు 258 కిలో మీటర్ల జాతీయ రహదారుల విస్తరణకు గడ్కరీ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News