Monday, December 23, 2024

డీజిల్ వాహనాల తయారీపై కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం అధికం అవుతోందని, అందువల్ల డీజిల్ వాహనాల తయారీకి గుడ్‌బై చెప్పాలని, లేదంటే ఆ వాహనాలపై పన్ను శాతాన్ని పెంచవలసి వస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ డీజిల్ వాహనాల తయారీ కంపెనీలకు హెచ్చరించారు. డీజిల్ కార్లపై అదనంగా పదిశాతం జీఎస్టీని విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. దీంతో డీజిల్ కార్ల ధరలకు మరింత రెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్యాక్స్‌ను పెంచడం వల్ల ఆ కంపెనీలు తమ డీజిల్ కార్లను అమ్మడంలో ఇబ్బంది పడతాయని కేంద్రమంత్రి తన హెచ్చరికలో పేర్కొన్నారు.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. డీజిల్ వాహనాలపై పదిశాతం అధిక పన్ను వేయాలని భావిస్తున్నట్టు దీనిపై కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. డీజిల్ వాహనాల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడుతున్నట్టు చెప్పారు. డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన చేసిన నేపథ్యంలో టాటామోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, అశోక్ లేలాండ్ కంపెనీల
షేర్లు పడిపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News