మన తెలంగాణ/హైదరాబాద్: జోగులాంబ గద్వాల్ జిల్లా అడిషినల్ ఎస్పీ రాములు నాయక్‌పై వేటు పడింది. రాములు నాయక్‌ని డిజిపి ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి కారణం మునుగోడు ఉప ఎన్నికే. గద్వాల్ జిల్లా పోలీసు అధికారికి నల్గొండ జిల్లాలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక వల్ల వేటు పడటం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవటం సహజమే. అయితే ఈ నెల ఒకటి నుండి సెలవులో వెళ్లిన రాములు నాయక్ మునుగోడు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కలిసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తరపున రాములు నాయక్ ప్రచారం కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సంస్థాన్ నారాయణపురంలో బిజెపి లోకల్ లీడర్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నట్లు వార్తలొచ్చాయ. ఈ వ్యవహారంపై లా అండ్ ఆర్డర్ అడిషినల్ డిజిపి జితేందర్ సమగ్ర విచారణ జరిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కలిసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో డిజిపి ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Gadwal ASP Ramulu Naik Attached to DGP Office