Wednesday, December 4, 2024

తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి చంపేశాడు..

- Advertisement -
- Advertisement -

ఓ నరరూప రాక్షసుడు.. 11మందిని దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. మంగళవారం ఆ నర హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం నిందితుడిని గద్వాల జోన్ డీఐజి ఎల్ఎస్ చౌహాన్ మీడియా ముందు ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “11మంది హత్య చేసిన నాగర్ కర్నూల్ జిల్లాలో ఇంద్రానగర్ కాలనీకి చెందిన రామటి సత్యనారాయణ అనే నిందితుడిని అరెస్టు చేశాం. నిందితుడి నుంచి విషపదార్థాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, ఫోన్లు, సిమ్ కార్డులు, కారు స్వాధీనం చేసుకున్నాం. వనపర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తిలో గుప్త నిధుల పేరుతో నమ్మించి కిరాతకంగా హత్యలు చేశాడు. కర్ణాటకలోని బలగనూరు, ఎపీలోని అనంతపురం జిల్లాల్లోనూ హత్యలు చేశాడు. తాంత్రిక పూజలు చేసి గుప్తనిధులు సేకరిస్తానని నమ్మించి, అమాయకుల నుంచి డబ్బు, స్థలాలు, భూములు రాయించుకనేవాడు. తర్వాత నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి హత్య చేసేవాడు. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి చంపేవాడు. నిందితుడితోపాటు అతని నుంచి స్వాధీనం చేసుకున్న వాటిని కోర్టులో ప్రవేశపెడుతాం. ఇలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News