Friday, December 27, 2024

గద్వాల రెడ్ క్రాస్‌కు బంగారు, సేవా పతకాలు

- Advertisement -
- Advertisement -

గద్వాల: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారిగా ఉత్తమ సేవలకు గాను 2019-2020, 2020-2021, 2021-2022 వార్షిక సంవత్సరాలకు బంగారు పతకములతో పాటు సేవా పథకాలను ప్రకటించింది. అందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి బంగారు పతకం లభించగా, జిల్లా ఎస్పీ రంజన్ రతన్‌కుమార్, రెడ్‌క్రాస్ కోశాధికారి సంగాల అయ్యపురెడ్డి, గౌతం కుమార్ రెడ్డిలకు ప్రత్యేక పతకాలు లభించాయి.

ఈనెల 15న హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరుగనున్న ప్రత్యేక వార్షిక సర్వసభ్య సమావేశాలలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ చేతుల మీదుగా పతకాలు అందుకోనున్నారు. అవార్డు గ్రహితలకు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్వనిర్వాహక సభ్యులు, మండల కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News