Monday, January 20, 2025

గద్వాల ఎంఎల్‌ఎపై అనర్హత వేటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / గద్వాల ప్రతినిధి: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదం టూ హైకోర్టు శుక్రవారం అనర్హత వేటు వేసింది. అదే విధంగా రూ. 3 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. గద్వాల ఎమ్మెల్యేగా డికె అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. లాయర్లు డి.కె. అరుణ వివరాల మేరకు గత ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆస్తులను దాచిపెట్టి తప్పుడు ఆఫిడవిట్‌లను సమర్పించారని ఆరోపిస్తూ 23/1/19 బిజెపి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డి.కె. అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె లాయర్లు రవిశంకర్ జంధ్యాల యోగిత ప్రకాశ్‌లు వాదించగా కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఎమ్మెల్యే జవాబు ఇవ్వకపోవడం, లాయర్లను కూడా నియమించుకోకపోవడంతో కోర్టుకు డి.కె. అరుణ సమర్పించిన ఆధారాలే నిజమని తెలుస్తూ ఎక్స్ పార్టీ కింద గురువారం తీర్పును వెలువరించినట్లు లాయర్లు తెలిపారు. మూడు లక్షల జరిమానా విధిస్తూ రూ. 50వేల డి.కె. అరుణకు కోర్టు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించారు. ఇటిక్యాల మండలం తిమ్మాపూర్ దగ్గర ఉన్న ఆస్తి వివరాలను, పెండింగ్ ఫైన్‌లు, తన అఫిడబిట్‌లో పేర్కొనలేదని, ఓట్లలో కూడా తేడాలు ఉన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి అనర్హత వేటు వేయించినట్లు తెలుస్తుంది.
కోర్టు తీర్పును అమలు చేయాలి: డికె అరుణ
హై కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బిజెపి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డి.కె. అరుణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గద్వాలలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అన్ని వివరాలు క్లుప్తంగా వివరించాల్సి ఉన్నదన్నారు. కావాలని తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించి అటు ఎన్నికల సంఘాన్ని ఇటు ప్రజలను మోసం చేశారన్నారు. దీనిపై అన్ని ఆధారాలతో కోర్టుకు సమర్పించడం జరిగిందన్నారు. కోర్టు కూడా ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడంతో ఎక్స్ పార్టీగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే తీర్పు చాలా లేటుగా వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు.
సుప్రీంకోర్టు కెళ్తా : కృష్ణమోహన్‌రెడ్డి
తన వాదనలు వినకుండా, తనకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా హైకోర్టు తీర్పునిచ్చిందని అయినప్పటికి కోర్టులను గౌరవిస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పుపై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రజలు తన పక్షాన ఉన్నారని వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News