Thursday, January 23, 2025

గద్వాల ఎంఎల్‌ఎ డికె అరుణ

- Advertisement -
- Advertisement -

ఆమె పేరును ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇసి ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : గద్వాల అసెంబ్లీ నియోజవర్గ ఎమ్మెల్యేగా డికె అరుణ ఎన్నికైనట్లుగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని పేర్కొంది. ఈసందర్భంగా హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ సీఈవోకు ఈసీ అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు. జోగులాంబ జిల్లా గద్వాల ఎమ్మెల్యేగా బి. కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని ఇటీవల న్యాయస్థానం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసినందుకు శిక్షగా రూ.2.50 లక్షలు జరిమానా విధించింది. ఖర్చుల కింద పిటిషనర్ డికె అరుణకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించింది. కృష్ణమోహన్ రెడ్డి తరువాత అత్యధిక ఓట్లు సాధించిన అరుణను 2018 డిసెంబరు 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News