Saturday, April 26, 2025

చివరి నిమిషంలో గగన్‌యాన్ ప్రయోగం నిలిపివేత..

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోటలో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ ప్రయోగం నిలిచిపోయింది. చివరి నిమిషంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో గగన్‌యాన్ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిలిపివేశారు. టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 రాకెట్‌లో సాంకేతిక లోపం తలేత్తడంతో కౌంట్ డౌన్ కు నాలుగు సెకండ్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తామని, అన్ని సరిచూసుకుని మరోసారి పరీక్ష చేపడతామని ఆయన తెలిపారు.ఆ తర్వాత ప్రయోగ తేదీని ప్రకటిస్తామని సోమనాథ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News