- Advertisement -
చెన్నై ఐపిఎల్ ట్రోఫీ సాధించడంలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవోన్ కాన్వేలు ముఖ్య భూమిక పోషించారు. ఆరంభ మ్యాచ్ నుంచే వీరిద్దరూ అత్యంత నిలకడైన ఆటతో అలరించారు. ప్రతి మ్యాచ్‌లో వీరిద్దరూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఒకరు విఫలమైతే మరోకరూ తమ బ్యాట్‌తో జట్టును ఆదుకున్నారు. గుజరాత్‌తో జరిగిన కీలకమైన ఫైనల్లో కూడా రుతురాజ్, కాన్వేలు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ కాన్వే, రుతురాజ్‌లు ఒత్తిడికి గురికాకుండా బ్యాటింగ్ చేశారు. దీనికి ప్రతిఫలంగా కాన్వేకు ప్రతిష్టాత్మకమైన ప్లేయర్ ఆఫ్‌ది ఫైనల్ అవార్డు లభించింది. ఇక ఈ సీజన్‌లో రుతురాజ్ అయితే పరుగుల వరద పారించాడు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి జట్ల బౌలర్లను హడలెత్తించాడు. పలు మ్యాచుల్లో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. కాన్వే కూడా తనవంతు సహకారం అందించాడు.
- Advertisement -