Friday, December 20, 2024

లంచం కేసులో గెయిల్ డైరెక్టర్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Gail director arrested in bribery case

 

న్యూఢిల్లీ : లంచం ఆరోపణల కేసులో నాచురల్ గ్యాస్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ గెయిల్ డైరెక్టర్ (మార్కెటింగ్) ఇ.ఎస్.రంగనాథన్‌ను సిబిఐ అరెస్టు చేసింది. మహారత్న ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ నుంచి పెట్రో కెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు డిస్కౌంట్ ఇచ్చేందుకు రూ.50 లక్షలకు పైగా లంచం తీసుకున్నారనే ఆరోపణల కేసులో ఆయన్ని సిబిఐ అరెస్టు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో రంగనాథన్, వ్యాపారవేత్తలు ఉన్నారని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని సిబిఐ తెలిపింది. ఎనిమిది ప్రాంతాల్లో సిబిఐ సోదాలు నిర్వహించింది. రూ.1.29 కోట్ల నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు సిబిఐ అధికార ప్రతినిధి ఆర్‌సి జోషి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News