Sunday, November 24, 2024

న్యాయశాఖ నివేదిక వచ్చాకే ట్రిబ్యునల్‌పై నిర్ణయం

- Advertisement -
- Advertisement -

Gajendra Singh Shekhawat's statement on distribution of Krishna water

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటన
రెండు రాష్ట్రాలు కోరితే గెజిట్ అమలు వాయిదాకు సిద్ధమని వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీజలాల పంపంణీలో తెలుగు రాష్ట్రాల మధ్య వాటాలు తేల్చేందుకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలా.. వద్దా అన్న అంశంపై కేంద్ర న్యాయశాఖ నివేదిక కోరామని, నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు. గురువారం ఢిల్లీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణానదీజల వివాదాలపై అనేక వివరణలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనందువల్ల కృష్ణానదీజలాల్లో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలకోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణానదీజలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ వేయాలా లేక ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునల్ పరిధిలోనే ఈ వివాదం పరిష్కరించుకోవాల అన్నదానిపై న్యాయ నిపుణుల సలహాలు , సూచనలు కోరామన్నారు. న్యాయశాఖ నుంచి నివేదిక వచ్చాకే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ఆంధప్రదేశ్ రాష్ట్ర పునర్‌విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదీజలాల యాజమాన్య బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డుల పరిధిని గుర్తించి ఈ రెండు నదుల పరివాహకంగా ఉన్న ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి చేర్చేందుకు కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ప్రాజెక్టులను బోర్డుల పరిధిలొకి చేరిస్తే నదీజలాల పంపిణీ, నీటివిడుదల నిర్వహణ తదితర అంశాలు సులభతరమవుతాయన్నారు. గెటిజ్‌నోటిఫికేషన్ అమలుకు సంబంధించి తెలంగాణ ,ఆంధప్రదేశ్ రాష్ట్రాలు చర్చింకుని ఒక అంగీకారానికి వచ్చి గెజిట్ అమలును వాయిదా వేయాలని కోరితే అందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్ర మంత్రి షెకావత్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సిద్దంగా వుందన్నారు. కృష్ణానదీపరివాహకంగా జలవిత్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఎలాంటి గందరగోళం లేదన్నారు. ఇందుకు సంబంధించి కూడా గెజిట్ నోటిఫికేషన్‌లో పూర్తి స్పష్టత ఉందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కూడా నదీజలాల వివాదాలను సామరస్యంగా పరిష్కరించాలన్న అభిప్రాయంతోనే ఉందన్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టులను కృష్ణానదీజలాల యాజమాన్యబోర్డుకు అప్పగించం అనే నిబంధన ఎక్కడా లేదన్నారు. నదీజలాల్లో వాటాలు తేల్చే విషయంలో ట్రబ్యునల్ ఏర్పాటు చేయటం అనేది చాలా పెద్ద అంశం అని ,దీనిపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. న్యాయశాఖ నుంచి తగిన సలహాలు సూచనలతో సవివరంగా నివేదిక వచ్చాక దాన్ని పరిశింలిచి కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. అప్పటిదాకా కృష్ణానదీజలాలలో భాగస్వామ్యరాష్ట్రాలుగా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రా్రష్ట్రాలు వేచివుండాలన్నారు. నీటి నిర్వహణ అంశాల్లో సంయమనం పాటించాలని కోరారు. కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో ఉన్న ్రప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను బోర్డులకు అప్పగిస్తే రెండు రాష్ట్రాల మధ్యన జలవివాదాలకు ఆస్కారమే ఉండదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కృష్ణానదీలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలను పరిష్కరించమని ప్రధానమంత్రి నరేంద్రమోడి తనతో చెప్పారన్నారు. ఎపి పునర్ విభజన చట్టం ప్రకారమే బోర్డుల పరిధి నిర్ణయిస్తూ గెజిట్ నోటిపికేషన్ విడుదల చేశామన్నారు.

అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ , ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకారం మేరకే గెజిట్ రూపొందించనట్టు తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం మాట్లాడుకొని ఎలా అమచేయాలన్నది ఆలోచించాలని కోరారు. కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణకు తగిన వసతులు కూడా కల్పించాలని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇద్దరు ముఖ్యమంత్రులను కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News