Monday, December 23, 2024

పెద్దపల్లి ఎంపి అభ్యర్థిత్వానికి గజ్జల కాంతం దరఖాస్తు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్‌పార్టీ తరఫున పెద్దపల్లి పార్లమెంట్ (ఎంపీ) అభ్యర్థిత్వాన్ని కోరుతూ పార్టీ పరిశీలకుడికి దరఖాస్తు చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిత్వం కోసం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారంగా పెద్దపల్లి పార్లమెంట్ (ఎంపీ) అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నట్లు గజ్జలకాంతం తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి , పార్టీ నేతల సూచనలను పరిగణనలోకి తీసుకుని తనకు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని వినతిపత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. ఈ మేరకు ఓయూ గిరిజన రాష్ట్ర నాయకుడు సంజీవ్ నాయక్‌తో కలిసి ఆయన పార్టీ పరిశీలకుడిని కలిసి దరఖాస్తు చేసుకున్నట్లు గజ్జలకాంతం తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News