Sunday, December 22, 2024

60 రోజుల్లో గజ్వేల్ – సిద్దిపేట్ రైల్ ట్రయల్ రన్: హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గజ్వేల్ – సిద్దిపేట్ రైల్వే లైన్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలంగాణ ఆర్థిక మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. మరో 60 రోజుల్లో ట్రయల్ రన్ కూడా జరగగలదన్నారు. గజ్వేల్‌-సిద్దిపేట్ పనులను గురువారం ఆయన తనిఖీ చేశారు. మండపల్లి వద్ద ట్రాక్ పనులను ఆయన పరిశీలించారు. పనుల గురించి ఆయన రైల్వే అధికారులతో చర్చించారు. మనోహరాబాద్ నుంచి కొతపల్లి వరకు ఉన్న 151 కిమీ. కొత్త రైల్వే లైన్‌ను గజ్వేల్ వరకు ఇప్పటికే విస్తరించారు. ఈ కొత్త ట్రాక్ గజ్వేల్‌-సిద్దిపేట్, సిరిసిల్లా నుంచి సికింద్రాబాద్‌కు కనెక్ట్ అవుతుందన్నారు హరీశ్ రావు.

సిద్దిపేట్‌-సిరిసిల్లా రైల్వే లైన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు కేటాయించిందని, రైల్వే లైన్ పనులు త్వరలో మొదలవుతాయని, ఆగస్టు 15 వరకు పూర్తవుతాయని ఆయన తెలిపారు.

‘సిద్దిపేట్‌కు ఇప్పటికే ఐటి టవర్, ఇండస్ట్రీయల్ కారిడార్ వస్తున్నాయని, రైల్వే సర్వీస్ సైతం అభివృద్ధికి ఊతం ఇవ్వగలదు’ అని మంత్రి తెలిపారు. ఆయన ఇంకా మిట్టపల్లి -హన్మకొండ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రొగ్రెస్ గురించి ఆరా తీశారు. నిర్మాణ పనుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చూడాల్సిందిగా హరీశ్ రావు అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వెంబడి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్(రైల్వే) సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, సిద్దిపేట్ ఆర్‌డివో రమేశ్ బాబు, ఇతరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News