Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ నేతృత్వంలో మారిన గజ్వేల్ రూపురేఖలు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: వ్యాపారాలకు అనుకూల ప్రాంతం గజ్వేల్ అని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డా.యాదవరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం రోజు ఛైర్మెన్ స్థానిక వ్యాపారవేత్తలు అంకం ప్రభు లింగం, జగదీశ్వర్ ఆధ్వర్యంలో నుతనంగా ఏర్పాటు చేసిన రామ్ రాజ్ కాటన్ షోరూం జిఎం శశిధర్ నాయక్, ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి,మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్త లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ వ్యాపార కేంద్రాలకు అనువైన ప్రదేశం అని rఎం కెసిఆర్ నేతృత్వంలో గజ్వేల్ రూపు రేఖలు మారాయని హైదరాబాద్ లో ఉండే వ్యాపార కేంద్రాలు గజ్వేల్ కి రావడం శుభ సూచకమని,యువత వ్యాపారంలో రాణించాలని రామ్ రాజ్ కాటన్ యాజమాన్యం వినియోగ దారుల మన్నన పొందుతూ మంచి గుర్తింపు పొందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పిటిసి మల్లేశం, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ జఖియుద్ధున్,కౌన్సిలర్స్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్,బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News