Monday, January 20, 2025

గల గల ఏరులా..

- Advertisement -
- Advertisement -

స్వప్న సినిమా ప్రొడక్షన్ హౌస్ కథల ఎంపికలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో సంగీతం విషయంలో కూడా అంతే జాగ్రత్త తీసుకుంటుంది. స్వప్న సినిమా వారి గత సినిమాలన్నీ మ్యూజికల్ హిట్స్. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించిన చిత్రం ’అన్నీ మంచి శకునములే’ సినిమా కూడా థియేటర్లలోకి రాకముందే మ్యూజికల్ హిట్ అవుతోంది. సినిమాలోని మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

గురువారం థర్డ్ సింగిల్ ‘గల గల ఏరులా’ పాటని విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ తనదైన శైలిలో శ్రోతలని మైమరపించే పాటను కంపోజ్ చేశారు. ఇటలీలోని కొన్ని అందమైన లొకేషన్లలో ఈ పాటను చాలా అందంగా చిత్రీకరించారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ఉత్సాహంగా కనిపించారు. వారి కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కొరియోగ్రఫీ చక్కగా ఉంది. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News