Wednesday, January 22, 2025

13 రోజుల బ్యాటరీ లైఫ్‌తో గెలాక్సీ ఫిట్ 3

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ తాజాగా గెలాక్సీ ఫిట్3ని విడుదల చేసింది. ఇది 13 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తోంది. గెలాక్సీ ఫిట్3 సరికొత్త డిజైన్‌తో, వినియోగదారులు తెలివిగా పని చేయడానికి, వారి ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, మెరుగైన కనెక్ట్ చేసిన అనుభవాలను ఆస్వాదించడానికి సహాయపడుతుంది.

గెలాక్సీ ఫిట్3 ఫిబ్రవరి 23 నుండి సామ్‌సంగ్.కామ్, అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ ఫిట్3 కలర్స్ గ్రే, సిల్వర్, పింక్ గోల్ లభిస్తుండగా, ధర రూ. 4999గా నిర్ణయించారు. క్యాష్ బ్యాక్ రూ. 500 కూడా అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News