Saturday, January 11, 2025

నేను పులిని.. వెనుకడుగు వేయను: గాలి జనార్దన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తాను బిజెపిలోకి మళ్లీ వెళ్లనున్నట్లు వస్తున్న ఊహాగానాలను మైనింగ్ దిగ్గజం గాలి జనార్దన్ రెడ్డి శుక్రవారం ఖండించారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలని, తాను మళ్లీ బిజెపికి చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బిజెపిలోకి వస్తారన్న విశ్వాసం తనకు ఉందంటూ కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చేసిన వ్యాఖ్యలపై జనార్దన్ రెడ్డి స్పందిస్తూ తాను వనెకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పారు.

వెనుకడుగు వేసే వ్యక్తి ధైర్యవంతుడు కాడు.. సిబిఐ ఉత్తర్వులను చూసి నేను షాక్‌కు గురికాలేదు. ఇతరులకు షాక్ ఇవ్వడానికి నేను సిద్ధం. బోనులో పెట్టినా పులి ఎప్పటికీ పులే..అంటూ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విదేశాలలో తాను డబ్బు దాచుకోలేదని, ఒకవేళ దాచినా దాన్ని వెలికితీయడం దర్యాప్తు సంస్థలకు ఎంతసేపని ఆయన ప్రశ్నించారు.

విదేశాలలో తన డబ్బు ఉంటే దాన్ని తీసుకురావాలని, ఆ డబ్బును ఇక్కడి ప్రజలకు పంచిపెడతానని ఆయన సవాలు చేశారు. ఒతర పార్టీల నాయకులు తన పార్టీలో చేరకుండా భయపెట్టేందుకే ఇటువంటి వదంతులను ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఏర్పాటు చేసిన కొత్త పార్టీని ముందుకు తీసుకువెళ్లకుండా తనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News