ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ఇప్పుడు కర్నాటక మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. ఇది రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్న తెలుగు, -కన్నడ ద్విభాషా చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ కొట్టగా, కన్నడ లెజెండ్ స్టార్ డాక్టర్ రవిచంద్ర.వి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ “కిరీటీని పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.
చాలా ప్రామిసింగ్‌గా కిరీటీ లుక్స్ ఉన్నాయి”ని అన్నారు. హీరో కిరీటి మాట్లాడుతూ “నాకు హీరోగా అవకాశమిచ్చిన సాయి కొర్రపాటికి ధన్యవాదాలు. ఈ సినిమాలో మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి”అని పేర్కొన్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందబోతోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో తిరిగి సినిమాల్లోకి వస్తోంది. లెజెండ్ స్టార్ డా.రవిచంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా కె.సెంథిల్‌కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.