Friday, November 22, 2024

బిజెపిలోకి గాలి జనార్ధన్ రెడ్డి.. పార్టీ విలీనం!

- Advertisement -
- Advertisement -

మూడోసారి అధికారం దక్కించుకోవాలని బిజెపి..లోక్ సభ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో అడుగులేస్తోంది. ఈ క్రమంలో పలువురు ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నాయకులు బిజెపిలోకి వెళ్లి కండువా కప్పుకున్నారు. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంత గూటికి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం మల్లేశ్వరంలోని బిజెపి కార్యాలయంలో రాష్ట్ర నేతల సమక్షంలో గాలి జనార్ధన్ రెడ్డి కమలం పార్టీలో చేరబోతున్నానని వెల్లడించారు. తన పార్టీ.. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేర్​పీపీ)ని బిజెపిలో విలీనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తనతోపాటు పార్టీ నేతలంతా బిజెపిలో చేరుతారని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాని కలిశారు. ఈ సందర్భంగా బిజెపిలో తన పార్టీ విలీన అంశంపై అమిత్ షాతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.

బిజెపికి బయట నుంచి మద్దతు ప్రకటించడం కంటే పార్టీని విలీనం చేయడానికి నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారని గాలి జనార్ధన్ రెడ్డి తెలిపారు. బిజెపి అనేది మా రక్తంలోనే ఉందని.. మళ్లీ పార్టీలో చేరి సాధరణ కార్యకర్తగా పని చేస్తానన్నారు. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News