బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వంలో ఎస్.క్రిష్ణ నిర్మించిన ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “తెలుగు సినిమాల్లో ఇంతవరకు చూడని ప్రయోగం ఈ సినిమాలో చేయడానికి ప్రయత్నించాము. ఈ సినిమా తండ్రీ కొడుకుల కథ. తండ్రిగా నేను, కొడుకుగా శ్రీవిష్ణు నటించాము.
ఒక మంచి సినిమా చూశామనే ఆనందం ప్రేక్షకులకు, ఒక మంచి సినిమా చేశామనే ఆనందం మాకు ఈ చిత్రం అందించింది”అని అన్నారు. శ్రీవిష్ణు మాట్లాడుతూ “ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ వయసులో కూడా తను ఏ క్యారెక్టర్ అయినా చేయగలనని నిరూపించుకున్నారు”అని చెప్పారు. నిర్మాత ఎస్.కృష్ణ మాట్లాడుతూ “ఈ సినిమా చూసిన వాళ్లు కొందరు మాకు ఫోన్ చేసి కొన్ని సీన్స్‌లో తమకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయని చెప్పారు. ఈ క్రెడట్ అంతా రాజేంద్రప్రసాద్, మా టీమ్‌కి చెందుతుంది. సినిమాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు”అని తెలిపారు. ఈ సమావేశంలో కమేడియన్ సత్య, హీరోయిన్ లవ్‌లీ సింగ్ పాల్గొన్నారు.