మొహబ్బత్ కల్ భి థీ
ఆజ్ భి హై
ఫరక్ సిర్ఫ్ ఇత్నా హై
కల్ మొహబ్బత్ హసీ సే ఝలక్తీ తి
అబ్ ఆన్సువో మే ఝలక్తీ హై
ప్రేమ నిన్నా ఉంది ఇవ్వాళా ఉంది
తేడా అల్లా
నిన్న ప్రేమ చిరునవ్వుతో మిలమిలలాడితే
ఇవ్వాళ కన్నీళ్ళతో విలవిలలాడుతోంది
సవాల్ జహర్ క నహీ థా
వో తో మై పీగాయా
తక్లీఫ్ లోగోంకో తబ్ హుయీ
జబ్ మై జీ గయా
ప్రశ్న విషం గురించి కానే కాదు
దాన్ని నేను ఎప్పుడో తాగేశాను
జనం బాధల్లా ఏమిటంటే
అయినా నేనింకా బతికే ఉండడం
సొంచా తుమ్హారే లియే తడప్నా ఛోడ్ దేయింగే
సొంచా తుమ్హారే లిఏ తరస్నా ఛోడ్ దేయింగే
దిల్ సే కహా ఆయె దిల్ భూల్ జా ఉస్
దిల్ నే కహా
దోబారా కహా తో ధడక్నా ఛోడ్ దేయింగే
నీ కోసం బాధపడడం మానేద్దాం అనుకున్నా
నీ కోసం అల్లాడిపోవడమూ మానేద్దాం అనుకున్నా
హృదయానికి చెప్పా తనని మర్చిపొమ్మని
మరోసారి ఆ మాట అంటే
నేనిక కొట్టుకోవడమే మానివేస్తానంది
ఖూబియా ఇత్నా తో నహీ హమ్ మే,
కి తుమ్హే కభీ యాద్ ఆయేంగే,
పర ఇత్నా తో ఎత్బార్ హై హమే ఖుద్ పర్,
ఆప్ హమే కభీ భూల్ నహీ పాయేంగే
నీకు పదే పదే జ్ఞాపకం వచ్చే అంత
గొప్ప సుగుణాలు నాలో లేకపోవచ్చు
నా మీద నాకా మాత్రం నమ్మకం ఉన్నది
నన్ను మరవడం నీ వల్ల కానే కాదని
అనువాదం: దేవులపల్లి అమర్
బొమ్మలు: దేవులపల్లి శృతి