Monday, January 27, 2025

గుల్జార్‌కి గలియోమె

- Advertisement -
- Advertisement -

తేరే దోస్తీ నే బోహోత్ కుచ్ సిఖాదియా
మేరి ఖామోష్ సి దునియా కో హసా దియా
మై కర్జ్దార్ హు ఉస్ ఖుదా కా జినో నే ముజ్హే
తేరే జయిసే దోస్త్ సే మిలా దియా

నీ స్నేహం ఎంతో నేర్పించింది
నా మౌన ప్రపంచం లో నవ్వులు పూయించింది
రుణపడి ఉంటానా దేవునికెంతో
నీలాంటి స్నేహితుణ్ణిచ్చినందుకు

బదల్ దియే హై హమ్నే
అబ్ నారాజ్ హోనే కే తరీకే
రూట్ నే కే బజాయే
బస్ హల్కే సే ముస్కురాదేతే హై

మార్చేసానిప్పుడు నేను
కోపగించుకునే పద్ధతులన్నీ
కోపమొస్తే అలగడం మాని
విసురుతున్నా చిన్న చిరునవ్వుల్ని

అదబ్ సీఖ్ నా హైతో
కలం సే సీఖో
జబ్ భి చల్తీ హై
సిర్ ఝుకా కర్ చల్తీ హై

నేర్చుకోవాలంటే అణకువను
కలాన్ని చూసి నేర్చుకో
తల వంచే రాస్తుంది చూడు
రాసే ప్రతిసారీ

కల్ రాత్ సారే గమ్
ఆస్మాన్ కో సునా దియే హం నే
ఆజ్ మై చుప్ హు ఔర్
ఆస్మాన్ బర్స్ రహా హై

నిన్న రాత్రి నా బాధలన్నీ
ఆకాశానికి చెప్పేసుకున్నా
ఇవ్వాళ నేను మౌనంగా ఉన్నా
ఆకాశం భోరున రోదిస్తున్నది

అనువాదం: దేవులపల్లి అమర్

బొమ్మలు: దేవులపల్లి శృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News