Monday, February 3, 2025

గుల్జార్‌కి గలియోమె

- Advertisement -
- Advertisement -

జయసే జయసే ఉమ్ బడ్‌తీ హై
దిన్ ప్రతి దిన్ ఇన్సాన్ రయీస్ బంతా జాతా హై
చాందీ బాలో మే, సోనా దాంతో మే,
మోతీ ఆంఖో మే,
శక్కర్ ఖూన్ మే ఔర్ మెహంగీ పత్థర్ కిడ్నీ మే పాయె జాతే హై

వయసు పెరుగుతున్న కొద్దీ
పెరుగుతోంది రోజురోజుకూ సంపద
వెంట్రుకల్లో వెండి, పళ్ళలో బంగారం,
ముత్యాలు కళ్ళలో, చక్కర రక్తంలో,
విలువైన రాళ్ళు కిడ్నీలో ఎంత సంపదో

ఇస్ సాల్ కా సఫర్ కుచ్
యూ గుజర్ గయా..
కుచ్ అంజానే హోగయే కుచ్
అన్జానో కో అప్నా కర్ గయా

గడిచిపోయిందలా ఈ ఏడాది ప్రయాణం కొందరు ఆప్తులు అపరిచితులైపోతే మరికొందరు అపరిచితులు ఆప్తులయ్యారు

కాంటేవాలీ తార్ పే కిస్‌నే
గీలే కపడే టాంగీ హై
ఖూన్ టపక్ తా రెహతాహై
ఔర్ నాలీ మే బహేజాతా హై
క్యో ఇస్ ఫౌజీకి బేవా హర రోజ్ ఏ వర్దీ ధోతీ హై

ఆరేసారెవరో ముళ్ళ దండెం మీద తడిబట్టల్ని చుక్కలుగా రాలుతూ రక్తం ప్రవహిస్తోంది కాల్వలో ఎందుకా సైనికుని వితంతువు అయిన భార్యరోజూ ఉతికి ఆరేస్తోంది
ఆయన సైనిక యూనిఫామ్

బస్ ఏక్ మొహబ్బత్ హీ
న సమఝ్ పాయె తుం
బాకీ మేరె హర్ గలతీ కా
హిసాబ్ బరాబర్ రఖతే హో

ఒక్క నా ప్రేమను మాత్రమే సరిగ్గా అర్థం చేసుకోలేక పోయావు నువ్వు
నా మిగిలిన తప్పులన్నిటి లెక్కా
పక్కాగా ఉంది నీ దగ్గర

అనువాదం: దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News