- Advertisement -
సొంచేతా దర్ద్ కీ దౌలత్ సే
ఏక్ మై హీ మాలా మాల్ హు
దేఖా జో గౌర్ సే తో
హర్ కోయీ రయీస్ నికలా
అనుకునేవాణ్ణి
బాధల సంపదతో
నేనొక్కణ్ణే కుబేరుణ్ణని
తీరా పరికించి చూస్తే
చుట్టూతా అంతా
కుబేరులే
సహర్ భి రాత్ భి
దుపహర్ భి మిలీ లేకిన్
హమ్ హీ నే షామ్ చునీ హై
—-
దొరికాయి రాత్రీ, పగలూ,
కానీ, సాయంత్రాన్నే
ఎంచుకున్నా నేను
కభీ కభీ కిసీ సే
ఐసా రిశ్తా బన్ జాతా హై
కి హర్ చీస్ సే పహేలే
ఉసీ కా ఖయాల్ ఆతా హై
అప్పుడప్పుడు కొందరితో
ఎలాంటి బంధం ఏర్పడుతుందంటే
గుర్తొస్తుంటారు ప్రతిసారీ వాళ్ళే
అన్నింటికన్నా ముందుగా
గమ్ బోహోత్ హై మగర్
ఖులాసా కౌన్ కరే
ముస్కురా దేతా హు యు హీ
అబ్ తమాషా కౌన్ కరే
దుఃఖం చాలానే ఉంది కానీ
బహిరంగంగా ఏమి చెప్పనూ
అందుకే నవ్వేస్తుంటానలా
దీన్నో తమాషా ఏం చెయ్యనూ?
అనువాదం: దేవులపల్లి అమర్
బొమ్మలు: దేవులపల్లి శృతి
- Advertisement -