Sunday, February 23, 2025

గుల్జార్‌కి గలియోమె

- Advertisement -
- Advertisement -

ఉడా దేతీ హై నీందే
కుచ్ జిమ్మేదారియా ఘర్ కి
రాత్ మే జాగనే వాలా హర షక్స్
ఆశిక్ నహీ హోతా

ఎగరగొట్టి దూరం చేస్తాయి నిద్రని
ఇంటి ఈతి బాధలు కొన్ని
రాత్రంతా జాగారం చేసే ప్రతివాడూ
ప్రేమికుడనుకుంటే పెద్ద పొరపాటే

జో భీ మిలే ఖిలాడీ హి నికలే
కోయి దిల్ సే ఖేల్ గయా
తో కోయీ జిందగీ సే

పెద్ద ఆటగాళ్లే తేలారు
కలిసినోళ్లంతా
కొందరు హృదయంతో ఆడుకుంటే
మరికొందరు జీవితంతో

తుం ఖాళీ హోగె తో
బతావోగే హాల్ అప్నా
మై భీడ్ మేభి సొంచతా రహేతా
హు కైసే హో తుం

నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు
తీరిగ్గా చెప్తావు నాకు నీ బాగోగులు
ఊపిరాడని రద్దీస్థలాల్లో కూడా
నీ గురించే ఆలోచిస్తుంటూ ఉంటా నేను

మిజాజ్ మే థోడీ సక్తీ
లాజ్మీ హై సాహెబ్ , లోగ్ పీ
జాతే అగర్ సముందర్ ఖారా
న హోతా

స్వభావంలో అప్పుడప్పుడు కొంచెం
కటువుగా ఉండడం అవసరం మిత్రమా
ఉప్పగా లేకపోతె సముద్రాన్నైనా
స్వాహా చేస్తారు మనవాళ్ళు

అనువాదం: దేవులపల్లి అమర్

బొమ్మలు: దేవులపల్లి శృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News