- Advertisement -
తక్లీఫ్
ఖుద్ హీ కమ్ హోగయీ
జబ్ ఆప్నోసే
ఉమ్మీద్ కమ్ హోగయీ
తగ్గిపోయింది
బాధ తనంతట తానె
ఆశ తగ్గిన వెంటనే
నా అన్న వాళ్ళ మీద
ఆయ్ నసీబ్ ఏక్ బాత్ తో బతా జరా
సబ్ కో ఆజ్మాతా హై యా ముజ్హసే
హీ దుశ్మనీ హై ?
కొంచెమొక మాట చెప్పు ఓ అదృష్టమా
పరీక్షిస్తుంటావా అందరినీ
లేక నా ఒక్కనిమీదే పగా
నీకు
కహేనే వాలో కా కుచ్ నహీ జాతా
సహనే వాలే కమాల్ కర్తే హై
కౌన్ డూన్డే జవాబ్ దర్దొంకా
లోగ్ తో బస్ సవాల్ కర్తే హై
పోయేదేమీ లేదు ఏదో ఒకటి అనేవాళ్లకు
సహించే వాళ్ళ ఓర్పే అద్భుతం
ఎవడు వెతకాలి వ్యథలకు మూలాలు
ప్రశ్నించడానికెప్పుడూ తయారు జనాలు
జబ్ సమయ ఖరాబ్
చల్తా హై
తో జిందగీ హర్ మోడ్
పర్ సతాతీ హై
చెడుకాలం నడుస్తున్నప్పుడు
మనల్ని సతాయిస్తుంది
ప్రతి మలుపులో
జీవితం
అనువాదం: దేవులపల్లి అమర్
బొమ్మలు: దేవులపల్లి శృతి
- Advertisement -