కిసీ కి యాదోంసే
అగర్ జిందగీ గుజర్ జాతీ
తో కభీ కోయీ కిసీసే మిల్‌నే కి
ఫరియాద్ న కర్తా
ఎవరి జ్ఞాపకాలతో నైనా
గడిచిపోతుందంటే జీవితం
కలవాలని ఎప్పుడూ కోరుకోరు
ఎవరూ ఇంకొకరిని
షాయరీ తో బస్ ఏక్ బహానా హై,
ఇరాదా తో బస్ తుమ్హారా ఏక్ పల్ చురానా హై
తుం ముజ్హే యాద్ కరో యా నా కరో,
ముజ్హే తో బస్ తుమ్హారే ఖయాలో మే ఆనా హై
ఈ కవిత్వమొక సాకు మాత్రమే
కోరికంతా నీ ఒక్క క్షణాన్ని దొంగిలించడమే
నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నా లేకపోయినా
నేనైతే మాత్రం నీ ఆలోచనల్లోకి రావలసిందే
హోగీ తుమ్హారే పాస్
జమానే భర్ కి డిగ్రియా
ఝాలక్తీ ఆన్ఖోంకో న పడ్ పాయె
తో అన్పడ్ హో తుం
ఉండొచ్చు నీ దగ్గర ప్రపంచంలోని పట్టాలన్నీ
చూపుల్ని మెరిసే కళ్ళని చదవలేకపోతే
ఏం లాభం నిరక్షరాస్యుడవే కదా నువ్వు
ఘమండ్ కరో భి తో కిస్ బాత్ కా
మర్నే కే బాద్ మేరె అపనే హీ
ముజ్హే చూనే కే బాద్ హాత్ దోఎంగే
ఏం చూసుకుని గర్విస్తూ ఎవరి జ్ఞాపకాలతో నైనా
గడిచిపోతుందంటే జీవితం విర్రవీగమంటావు
నన్ను నేను పోయాక నా ఆప్తులే
విగత దేహాన్ని ముట్టుకున్నాక
శుభ్రంగా కడుక్కుంటారు చేతుల్ని
అనువాదం: దేవులపల్లి అమర్
బొమ్మలు: దేవులపల్లి శృతి