సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన హీరో సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. కౌబాయ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాతో అశోక్‌గల్లాకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ యంగ్ హీరో మంగళవారం తన పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా అశోక్ గల్లా మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు...
మహేష్ ప్రశంసలతో ఆనందం…
నా మొదటి సినిమా ‘హీరో’ చూసిన తర్వాత మహేష్‌బాబు నాతో మాట్లాడుతూ ‘నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అని చాలా బాగా మెచ్చుకున్నారు. ఆయన ప్రశంసలతో నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇక మహేష్ బాబు నా ఫస్ట్ సినిమా విషయంలో కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని చాలా బాగా చెబుతారు.
నటుడిగా సంతృప్తి…
‘హీరో’ సక్సెస్‌తో నటుడిగా ఎంతో సంతృప్తి చెందాను. హీరోగా నిలబడాలిన అనుకున్నప్పుడు వచ్చిన సక్సెస్ ఇది. ‘హీరో’ వంటి మంచి కథతో రావడం హ్యాపీగా ఉంది.
అన్ని జోనర్స్‌లో చేస్తా…
ఇక నేను అన్ని జోనర్స్‌లో సినిమాలు చేయాలని ఆశ పడుతున్నాను. డ్యాన్స్, ఫైట్స్… ఇలా అన్నింట్లో బాగా చేయాలని ఉంది. అన్నింటిని దృష్టిలో పెట్టుకొని కథలను ఎంపిక చేసుకుంటున్నాను.
ఆ రీమేక్ చేయాలనుంది…
మహేష్ సినిమాల్లో ‘మురారి’ బెస్ట్ మూవీ. అంత అద్భుతమైన కథ మళ్లీ రాకపోవచ్చు. మహేష్ బాబు చాలా గొప్పగా చేశారు. నాకు నిజంగా రీమేక్ చేసే ఛాన్స్ వస్తే ఆ సినిమా చేస్తాను.
తదుపరి చిత్రాలు…
ఇంకా ఏ కథను ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. జూన్‌లోపు ఒక కథను ఫైనల్ చేసి మూవీని ప్రారంభిస్తాము.
Galla Ashok interview about Hero Movie