Thursday, January 23, 2025

రాజకీయాలకు గల్లా జయదేవ్ గుడ్ బై

- Advertisement -
- Advertisement -

రాజకీయాలనుంచి వైదొలగుతున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. గుంటూరులో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజకీయాల్లో కొనసాగడంవల్ల వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ లోక్ సభలో మౌనంగా ఉండలేననీ, తన పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నానని అన్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు.

మొదటి నుంచీ ముఠా రాజకీయాలకు తాను దూరంగానే ఉన్నాననీ, స్థానిక నాయకులనూ, ప్రజలనూ నమ్ముకునే రాజకీయాల్లో ముందుకు సాగానని జయదేవ్ చెప్పారు. తన వ్యాపారాలపై ఇడి నిఘా వేసిందనీ, తన ఫోన్లను టాప్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు స్వస్తి చెప్పి, వ్యాపారాలపై పూర్తిగా దృష్టి సారించాలనుకుంటున్నానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News