Friday, December 20, 2024

దావోస్‌లో గల్లా జయదేవ్

- Advertisement -
- Advertisement -

Galla Jayadev in Davos

మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి యువ నేత, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ దావోస్‌లో జరగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బిజీబిజీగా గడుపుతున్నారు. అమరరాజా బ్యాటరీస్ అధినేత హోదాలో దావోస్ సదస్సుకు హాజరైన గల్లా జయదేవ్.. ఇదివరకే కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పురితో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి విదితమే. తాజాగా బుధవారం తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌తో కలిసి జయదేవ్ మరో కీలక చర్చలో పాలుపంచుకున్నారు. ఇండియాస్ గ్రోత్ స్టోరీ పేరిట సిఎన్జీసి టివి 18 నిర్వహించిన ఈ చర్చా వేదికలో కెటిఆర్ సహా తెలుగు నేలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త శోభనా కామినేని, భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు సంజీవ్ బజాజ్, ఆశిష్ షాలతో కలిసి గల్లా జయదేవ్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News