Wednesday, January 22, 2025

అంగరంగ వైభవంగా గామా అవార్డ్

- Advertisement -
- Advertisement -

దుబాయ్‌లో ఏఎఫ్‌ఎం ప్రాపర్టీస్ సమర్పణలో గామా తెలుగు మూవీ అవార్డ్ 4వ ఎడిషన్ అంగరంగ వైభవంగా జరిగింది. దుబాయ్‌లోని జబిల్ పార్క్‌లో గామా అవార్డ్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహించారు. టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ అవార్డ్ వేడుకలో 2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి – బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్ వంటి 42 కేటగిరీలకు అవార్డులు అందజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అతిరథ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి హీరో మంచు మనోజ్… ఉత్తమ నటులుగా ఎంపికైన హీరోలు నిఖిల్ సిద్ధార్థ, సందీప్ కిషన్, తేజ సజ్జ, ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు డింపుల్ హయతి, దక్ష నగార్కర్, ఆషిక రంగనాథ్, నేహా శెట్టి, ఫరియ అబ్దుల్లాలకు గామా అవార్డులు అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికిగానూ.. గామా మూవీ ఆఫ్ ది డికేడ్ అవార్డును చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య అందుకున్నారు. జాతీయ పురస్కారం అందుకున్న పుష్ప ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ చిత్రాలుగా పుష్ప, బ్రో, సీతారామం… గామా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లుగా దేవి శ్రీ ప్రసాద్, తమన్, హేషం అబ్దుల్ వహాబ్, ఉత్తమ ఆల్బమ్‌గా ‘సీతారామం’- విశాల్ చంద్ర శేఖర్, బెస్ట్ సింగర్స్‌గా అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్, హారిక నారాయణ్, ఎంఎల్ శృతి, మౌనిక యాదవ్, ట్రెండింగ్ సాంగ్‌కు.. రఘు కుంచె, గామా గద్దర్ మెమోరియల్ అవార్డు నల్గొండ గద్దర్ నరసన్న, లెజెండరీ మ్యూజిక్ అవార్డ్ సంగీత దర్శకులు కోటి, 25 సంవత్సరాల సంగీత దర్శకులుగా ఎంఎం శ్రీలేఖ గామా పురస్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా గామా అవార్డ్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ వేదికగా ఈ గామా వేడుక నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. గామా జ్యూరీ సభ్యులు మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సీనియర్ దర్శకులు వీఎన్ ఆదిత్య, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ ఆధ్వర్యంలో సుమ, హైపర్ ఆది యాంకరింగ్ చేసిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సింగర్స్‌తో పాటలు, హీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మెన్స్, ముక్కు అవినాష్, రోహిణి కామెడీతో అలరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News