టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీల రిటైర్మెంట్ పై మాజీ క్రికెట్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో సౌతాఫ్రికాపై భారత్ ఉత్కంఠ విజయం సాధించింది. చివరి ఓవర్ కు జరిగిన నరాలు తెగే ఉత్కంఠ పోరులో టీమిండియా 7పరుగులతో గెలిచి రెండో సారి టీ20 ప్రపంచకప్ అందుకుంది.
అయితే, ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు.. టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించారు. వీరిద్దరి నిర్ణయం గంభీర్ స్పందిస్తూ.. భారత్ కు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ రోహిత్, కోహ్లీ, రాహుల్ ద్రావిడ్‌కు అభినందనలు తెలిపారు. టీ20 కప్ గెలవడం కంటే రిటైర్మెంట్‌కు మంచి సందర్భం ఏం ఉంటుందన్నారు. వారిద్దరూ వన్డే, టెస్ట్‌లలో జట్టుకు విలువైన సేవలు అందిస్తారని గంభీర్ చెప్పారు.
కాగా, 17 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్ కొట్టడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ అభిమానులు క్రాకర్స్ కాలుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జట్టుపై అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ప్రపంచకప్ గెలిచి దేశాన్ని గర్వించేలా చేశారని కొనియాడారు.
Moment that every Indian 🇮🇳 was waiting since Champions Trophy 2013
Congratulations to Team India @BCCI
and everyone who supported Indian Team in this Journey 🙌#INDvSA #indiawin #T20WorldCup2024 #ViratKohli𓃵pic.twitter.com/hTfshFq4rC— Ajay Jadeja (@AjayJadeja171) June 29, 2024