Wednesday, November 20, 2024

టీమిండియా ప్రధాన కోచ్‌గా గంభీర్?

- Advertisement -
- Advertisement -

దాదాపు ఖరారు..
త్వరలోనే ప్రకటించనున్న భారత క్రికెట్ బోర్బు
ముంబై : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తి కావోస్తోంది. అమెరికా వేదికగా జరుగనున్న టి20 వరల్డ్ కప్ అనంతరం ఈ పదవీ నుంచి ద్రవిడ్ తప్పుకోనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. పలువురు విదేశీ క్రికెటర్లు సయితం టీమిండియా కోచ్‌గా రావడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వినిపిస్తోన్న సమాచారం ప్రకారం టీమిండియా మాజీ ఆటగాడు కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపిఎల్ 17వ సీజన్‌లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది.

అంతకుముందు 2014లో గంభీర్ నాయకత్వంలో కోల్‌కతా ఐపిఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా ప్రధాన కోచ్ పదవికి గంభీరే సరైనోడుగా బిసిసిఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉంటాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఓ ఐపిఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. కోచ్ పదవికి సంబంధించి బిసిసిఐ కార్యదర్శి జై షా, గంభీర్‌ల మధ్య డీల్ కుదిరిందని, ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. కాగా ఐపిఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-, జైషా చాలాసేపు బహిరంగంగా మాట్లాడుకోవడం అందరూ చూశారు. టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే ఈ చర్చలు జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించే విషయమై బిసిసిఐ సమావేశం జరిగినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News