Monday, December 23, 2024

మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను కోహ్లీతో పాటు అతడికి ఇవ్వాలి: గంభీర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ చేయడంతో రెండు సెంచరీలు చేశాడు. మూడు వన్డేలలో కలిపి 283 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచాడు. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎంపిక చేయడంపై మాజీ టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్ స్పందించారు. మూడు మ్యచ్‌లలో తొమ్మిది వికెట్లు తీసిన సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌కు ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇద్దరు కలిపి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు. జాయింట్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశాడు. కొత్త సంవత్సరంలో శ్రీలంకతో సిరీస్ గెలిచిన భారత్ జట్టు …అదే విధంగా న్యూజిలాండ్‌పై గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News