- Advertisement -
లక్నో టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా
లక్నో: భారత క్రికెట్ ప్రధాన కోచ్‌గా ఎంపికైన గౌతం గంభీర్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రశంసలు కురిపించారు. మెంటార్‌గా గంభీర్ లక్నో జట్టుపై తనదైన ముద్ర వేశాడన్నారు. అతని పర్యవేక్షణలో లక్నో మెరుగైన జట్టుగా ఎదిగిందన్నారు. లక్నో టీమ్‌కు గంభీర్ అందించిన సేవలను ఎంత పొగిడినా తక్కువేనన్నారు.
మెంటార్‌గా గంభీర్ తన పాత్రను ఎంతో సక్రమంగా నిర్వర్తించారన్నారు. ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపి వారి నుంచి మెరుగైన ప్రదర్శనను రాబట్టారని ప్రశంసించారు. గంభీర్ లాంటి వ్యక్తి టీమిండియాకు ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడం ఎంతో ఊరటనిచ్చే అంశమన్నారు. గంభీర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి టీమిండియాను మరింత బలోపేతంగా తీర్చిదిద్దుతారనే నమ్మకాన్ని గోయెంకా వ్యక్తం చేశారు.
- Advertisement -