దుబాయ్ : భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఆసియా కప్ 2022లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో కోహ్లీ మంచి ప్రదర్శనలు కనబర్చడంతో అతను తన పీక్ ఫామ్‌ను అందుకోవడానికి ఈ ఇన్నింగ్స్ దోహదపడుతుందని గంభీర్ చెప్పాడు. హాంకాంగ్‌పై కోహ్లీ 44బంతుల్లో 59(నాటౌట్) ఆడడం మంచిదైందన్నాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ దాడి ఎలాంటిదనేది ఇక్కడ మాట్లాడుకోకూడదు. ఎలాంటి బౌలింగ్ అయినా పరుగులు చేయగలిగడనేది ముఖ్యం అని గంభీర్ చెప్పాడు. యుఏఈలో జరిగే ఆసియా కప్ టోర్నీకి ముందు ఫామ్ కోసం తీవ్రంగా తంటాలు పడ్డ కోహ్లీకి.. ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్లో నిలదొక్కుకున్న విధానం చాలా ప్రోత్సాహాన్నిస్తుందన్నాడు. ఇకపోతే హాం కాంగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 3సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి తాను ఫామ్‌లోకి తిరిగి వచ్చిన సంకేతాలను చూపించాడు. అలాగే అతను పాకిస్థాన్ మీద 34బంతుల్లో 35పరుగులు చేసి కాస్త స్థిరమైన ప్రదర్శన కనబరిచాడు.