Monday, December 23, 2024

ఆ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నాం : గంభీర్

- Advertisement -
- Advertisement -

ముంబై: టీమిండియాను మరింత బలోపేతం చే సేందుకు పటిష్ఠమైన ప్రణాళికతో ముందుకు సా గుతానని భారత జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీ ర్ స్పష్టం చేశాడు. కోచ్‌గా ఎంపికైన తర్వాత గం భీర్ తొలిసారి మీడియా సమావేశంలో మాట్లాడా డు. బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా దీనిలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గంభీర్ తన ప్రణాళికలను వివరించాడు. మూడు ఫార్మాట్‌లలోనూ భారత్‌ను బలమైన జట్టుగా తీర్చిదిద్దడమే తన ముందుకు ప్రధాన లక్షమన్నాడు. కోహ్లి, రోహిత్‌లు ఇప్పటికే టి20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారని, వీరి స్థానాలను భర్తీ చేయడం తన ముందున్న అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. భారత్‌లో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదని, అయితే వీరిని ఎవరినీ ఎంపిక చేయాలనే దానిపైనే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందన్నాడు. తాను మాత్రం అందరితో చర్చించి ముందుకు వెళతానని గంభీర్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News