ఢిల్లీ: ఫాబిఫ్లూ ప్రీగా ఇస్తానని బిజెపి ఎంపి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఫాబిఫ్లూ కొరత ఏర్పడింది. ఫ్లాబిఫ్లూ అవసరం ఉన్నవాళ్లు ఆధార్ కార్డు, ప్రిస్క్రిప్షన్ ఇచ్చి తీసుకెళ్లొచ్చని గంభీర్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. బిజెపి ఎంపి గంభీర్ దగ్గర ఫాబిఫ్లూ ఎక్కడదని ఆప్, కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గంభీర్ ట్వీట్‌పై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఫాబిఫ్లూ కోవిడ్ రోగులకు చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. ఫాబిఫ్లూ, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. రెండు మూడు రోజుల క్రితం గుజరాత్ బిజెపి అధ్యక్షుడు రెమ్డిసివిర ఇంజెక్షన్లను దాచిపెట్టిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర మాజీ సిఎం రెమ్‌డెసివిర్‌ను ఇంట్లో దాచిపెట్టుకున్నారు. బిజెపి పార్ట్‌టైమ్ ఎంపి ప్రాణాధార మందులను దాచిపెట్టుకున్నారని, వీళ్లు ప్రజాప్రతినిధులా, క్రిమినల్సా అంటూ ఆప్ నేత దుర్గేష్ పాఠక్ ట్వీట్ చేశారు.
గంభీర్… నీ దగ్గర ఫాబిఫ్లూ ఎక్కడిది?…
- Advertisement -
- Advertisement -
- Advertisement -