Wednesday, January 22, 2025

స్టార్క్ కు రూ.24.75 కోట్లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు..

- Advertisement -
- Advertisement -

ఇటీవల జరిగిన ఐపిఎల్ మినీ వేలం పాటలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ ను కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించింది. దీనిపై తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

తాము చాలా ఆలోచించే స్టార్క్‌ను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నామన్నాడు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా జట్టును విజయపథంలో నడిపించే సత్తా స్టార్క్ ఉందన్నాడు. కొత్త బంతితో పవర్‌ప్లేలో మెరుగైన బౌలింగ్ చేయడంలో స్టార్ దిట్ట అని పేర్కొన్నాడు. అంతేగాక కీలక సమయంలో బ్యాట్‌తోనూ చెలరేగే నైపుణ్యం ఉందన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News