ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను కించపరిచేలా రూపొందించినట్టు ఆరోపణలున్న ఆనలైన్ మొబైల్ గేమ్ ‘సెల్మాన్‌భోయ్’పై ముంంబయిలోని సివిల్‌కోర్టు తాత్కాలిక నిషేధం విధించింది. సోమవారం కోర్టు జడ్జి కెఎం జైశ్వాల్ ఇచ్చిన ఆదేశాలు మంగళవారం మీడియాకు అందాయి. ఖాన్ సమ్మతి లేకుండా ఆయణ్ని పోలిన పాత్రతో గేమ్‌ను రూపొందించినట్టు ప్రాథమిక పరిశీలనలో గుర్తించామని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ గేమ్‌ను గూగుల్‌ప్లేతోపాటు అన్ని సోషల్‌మీడియా వేదికల నుంచి వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ గేమ్‌పై సల్మాన్‌ఖాన్ గత నెలలో కోర్టును ఆశ్రయించారు. సల్మాన్‌ఖాన్‌ను ఆయన అభిమానులు సల్మాన్‌భాయ్‌గా పిలుచుకుంటారు. గేమ్‌టైటిల్‌కు ఈ ముద్దుపేరుకు పోలికలుండటమేగాక, ఆయనకు సంబంధించిన హిట్ అండ్ రన్ సంఘటనను అది గుర్తు చేసేలా ఉన్నదని కోర్టు గుర్తించింది. దాంతో, ఖాన్‌ను అవమానించే ఉద్దేశంతోనే గేమ్‌ను రూపిందించినట్టుగా భావించాల్సి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 20కి కోర్టు వాయిదా వేసింది. 2002లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఖాన్‌ను నిర్దోషిగా తేలుస్తూ 2015లో బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వడం గమనార్హం.
సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్‌ను పోలిన ఆన్‌లైన్ గేమ్‌పై తాత్కాలిక నిషేధం
- Advertisement -
- Advertisement -
- Advertisement -